పుట:Bharatiyanagarik018597mbp.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఇంగ్లండుదేశములవలె భారతదేశ మీవలస రాష్ట్రములతో తగవులాడి, దౌర్జన్యమునుజూపి, తుదకు వానిని గోల్పలేదు. అయ్యవి బయలువెడలిన నాటినుండి క్రీ. శ. 13 వ శతాబ్దప్రాంతామున అరబ్బులు, మున్నగు నితరజాతులవారికి వశమగు వరకునుగూడ నీవలసరాజ్యములతో, నత్యుత్తమమగు మైత్రినిపాటించి, యాదర్శప్రాయమై, భారతదేశ ముత్తమ మాతవలె నలరారుచుండెను. ఈదూరదేశములన్నిటియందునుగూడ భారతీయ నాగరికతాచిహ్నము లనేకములు నేటికిని గాంచనగుచున్నవి. నేటికిని కొన్నికొన్ని జాతులయొక్కయు, దేశములయొక్కయు సాంఘికజీవితమునందును, నాగరికతయందును భారతదేశ సంబంధము స్పష్టముగ గంపించుచున్నది.

భారతదేశముయొక్క యీయాధ్యాత్మిక దిగ్విజయమునకును, తత్పలితముయొక్క శాశ్వతత్వమునకునుగూడ ముఖ్యకారణములు ప్రాచీన భారతీయుల యాదర్శములే. క్రీ. పూ. 1500-500 నడుమ ప్రాచీన సామ్రాజ్యము లనేకములు ప్రబలినవి. వానికన్నిటికినిగూడ విదేశీయ నాగరీకతలతో ప్రత్యర్థిత్వము సంభవించినది. ఫినోషియనులు తాముజయించిన జాతుల యార్థికసంపదనెల్ల చూరగొని వారి ననాథులను జేసివేసిరి. అటుపై అస్సిరియనులు పశుబలముచే నెన్నియోతెగలను రూపుమాపి తమ సామ్రాజ్యమును స్థాపించిరి. ఈజిప్షనులును, రోమనులు నీమార్గమునే యవలంబించి ఖడ్గముతో తమనాగరికత నితరజాతులవారిలో వ్యాపింపజేసిరి. గ్రీసుదేశీయులుగూడ తాము జయించినజాతుల నాగరికతను నశింపజేసి వారందరును తమనాగరికతనే యవలంబి చుంట్లొనర్చిరి. ఇదేకాలమున భారతదేశమునందు ప్రాచీనార్యుల కితరజాతులతో సంబంధమేర్పడెను. కాని యీసందర్భమునం దార్యులు ప్రత్యర్దిజాతులను నిర్మూలింపజేయుటగాని, వారి నాగరికతను పూర్తిగ ద్వంసముజేయుటగాని, చేయక వారియెడ సామరస్యము నుపయోగించి, వారి నాగరికతయందలి యుత్తమాంశములనుగైకొని, తన్మూలమున దమసభ్యతనుగూడ