పుట:Bharatiyanagarik018597mbp.pdf/64

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బించుచుండిరి. మఱియొక చిత్రమేమన, కాంభోజ అన్నాందేశములందును, బలిద్వీపమునను గొన్ని యాలయములలో విగ్రహముండవలసిన స్థలమునం దొక శూన్యసింహాసనము మాత్రము స్థాపింపబడినది మహోన్నతములును, సుందరములునగు, నీయాలయములను, వానియందలి యీశూన్యాసనములను, గాంచినచో "చిదంబర రహస్య" మను నాంధ్రలోకోక్తికి గారణమగు ద్రవిడదేశములోని చిదంబరమునందలి దేవాలయము జ్ఞప్తికి వచ్చుచున్నది.

(6) మతము :- ఈ దేశములలోని పండితులు మతప్రవర్తకులుగనుండిరి. వీరిలో మూడు తెగలుండెడివి. "చూశూ" యనువారు బౌద్దులు. మహాయాన మతాను యాయులగుటచే బుద్దుని విగ్రహము నారాధించుచుండిరి. 'పసూవెయ్‌' (Pa-ssu Wei) అను నింకొక తెగవారు మెడలో యజ్ఞోప వీతమును ధరించుచుండిరి. బహుశ: వీరు వైష్ణవులైయుందురు. ఈ పాస్‌దూశబ్దమునకును వైష్ణవ గ్రంథమగు పాంచరాత్రాగమమునకును సంబంధమేమైన నుండవచ్చును.

(7) కట్టడములు :- ఈ ప్రాగ్భారతదేశములందలి కట్టడములు గూడ దక్షిణహిందూదేశ సంపర్కమును సూచించుచున్నవి. కాంభోజ దేశములోని 'అన్‌కోర్ వాట్‌' (Ankor Wat) దేవాలయ యీ సందర్భమునందగ్రగణ్యము. ఇయ్యది యంతరువులుగానున్నది. మొదట నొకచతురస్రమును, దానిపై నంతకంటెను చిన్నదగు మఱియొకటియు, నటుపై నింకనుజిన్నదియు, నిర్మింపబడి యీ విధమున పైకి పోనుపోను యీ కట్టడము చిన్నదగుచున్నది. ఎన్నియంతర్వులున్నవో యన్ని వరుసల మెట్లు వెలుపలికి గన్పించు చున్నవి. దక్షిణహిందూదేశములోని తిరుచినాపల్లికొండపై దేవాలయమును, తిరుప్పరన్ కున్రం కొండపై యాలయమునుగూడ నిటులే యున్నవి. ద్రవిడదేశమునందువలె నిచ్చటగూడ శైవ వైష్ణవ శిల్పము లెన్నియోగలవు. కాంబోడియాలోని యాలయములలో గోడలపై నను, ద్వారము