పుట:Bharatiyanagarik018597mbp.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ముననుండిన విభాగములలో అమరావతి, పాండురంగ, కౌథారయనునవి ముఖ్యములు. ఈ యమరావతికి బ్రాచీనాంధ్ర సామ్రాజ్యమునకు రాజధానిగనుండి చరిత్ర ప్రసిద్దినందిన యమరావతీనగరమే మాతృక. రెండవవి భాగము బొంబాయి రాష్ట్రమునందలి బ్రఖ్యాతయాత్రాస్థలమగు పండర్‌పూర్‌ను సూచించుచున్నది. కౌథారము కుఠారమను సంస్కృత పథమునకు రూపాంతరము. పరశురామ క్షేత్రమగు మలబారు నీపదము జ్ఞప్తికి దేగలదు. చంపాలోని హిందూరాజ్యము శ్రీమారునిచే నిర్మింపబడినది. దక్షిణహిందూదేశపు పాండ్యరాజుల కీనామ ముండెడిది. జావాలోని తకోపాయనుస్థలము నందలి శాసనమున సేనాముఖం, మణిగ్రామం, చాపత్తార్ అను సంఘములు పేర్కొనబడినవి. ఇందు కడపటి నామమునకును "శపథ" శబ్దమునకును సామ్యమున్నది. మలబారులో "సాపత్తార్" అనువారు రాజుల కంగరక్షకులుగ నుండిరి.

(5) దేవతలు :- ఈప్రాగ్భారతదేశమున నారాధింపబడుచుండిన దేవతలందరును దక్షిణహిందూదేశమునకు జెందినవారలే. ఇచట శైవ, వైష్ణవ, బౌద్దమతములును, వానికి జెందిన దేవతలు నుండిరి. శివునియారాదనము ప్రబలముగ నుండినది. దేవరాజగు నీతడు ద్రిమూర్తులలో నగ్రగణ్యుడుగనుండి, హర, పశుపతి, శంకర నామాభిరుధుడై యుండెను. ప్రత్యేక విష్ణుప్రతిమలును, శంకరనారాయణ హరిహరవిగ్రహములుగూడ నిట నుండినవి. వీరులుగాక లక్ష్మి, ఉమా, స్కంద, గణేశ, నందిమున్నగు దేవతలుగూడ నీదేశములలో నారాధింపబడుచుండిరి. బుద్దవిగ్రహములు సామాన్యములు. శివునితోబాటు శక్తిగూడ యీప్రాంతముల కేతెంచి భగవతియనుపేరిట నారాధింపబడు చుండెను. దక్షిణహిందూదేశములో రాజులు దేవాలయములను నిర్మించి యందలి దైవములకు దమనామముల నొసంగు టాచారమై యున్నది. అట్టి యాచారమే చంపా, కంబోడియా, ఇండోచైనారాజ్యములందును, జావాబలిద్వీపములందును రాజు లవలం