పుట:Bharatiyanagarik018597mbp.pdf/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పద్దతి శిల్పము లనేకములుకలవు. కాబూల్‌నగరముచెంత గొన్ని బౌద్ద నగరీశిదిలములున్నవి. కపిశానగరమున కనిష్క చక్రవర్తి యాస్థానమునందుండిన చైనారాయబారులచే నిర్మింపబడిన స్థూపమును, హ్యూన్‌ష్వాంగ్ వర్ణించిన యితరకట్టడములును గనుగొనబడినవి. హిందూకుష్ పర్వతముల నంటియున్న బమియన్ నగరమువద్ద కొండలలోనెన్నియో విహారములు, మహోన్నతములగు బుద్దవిగ్రహములగు బుద్దవిగ్రహములు నున్నవి.

తురుష్కులు :- క్రీ. శ. 5 వ శతాబ్దిలో నీభూమియంతయు హూణులకు వశమైనది. స్వపక్షపరపక్ష నిర్దూమధాములై యీక్రూరు లిట నవనవలాడుచుండిన భారతీయనాగరికతను ధ్వంసముగావించిరి. ముఖ్యముగ గాంధార ఉద్యానరాజ్యములకు వీరివలన గొప్పకీడుగల్గెను. 6 వ శతాబ్దమున తురుష్కులు హూణులను బారదోలి యీప్రదేశము నాక్రమించిరి. హ్యూన్‌ష్వాంగ్ కాలమున హిందూకూష్‌పర్వతములకు బశ్చిమమున 27 చిన్న రాజ్యములుండినవి. ఈ తురుష్కప్రభువులు బౌద్దమతమును విశేషముగ నాదరించిరి. క్రీ. శ. 626 లో 'షిహూకగన్‌' అనునతడు చైనాదేశమున ధర్మప్రచార మొనర్పనేగుచుండిన ప్రభాకరమిత్రుని, పిమ్మట చైనానుండి-భారతదేశమున కేతెంచుచుండిన హ్యూన్‌ష్వాంగ్‌నుగూడ మిక్కిలియాదరించెను. 7 వ శతాబ్ది మధ్యభాగమున హిందూదేశమునకు వచ్చిన 'పూకుంగ్‌' అను నొకభిక్షువు కాశ్మీరగాంధార దేశములలో నొకతురుష్కరాజు నాతనిభార్య పుత్రులును గట్టించిన దేవాలయములనుగాంచెను. కుస్‌డుజ్ అనుభాగమున జనులు విశేషముగ బౌద్దులైయుండిరి. బాల్‌ఖ్ రాష్ట్రములో 3000 మంది భిక్షువులుగల 100 విహారములీకాలము నందుండెడివి. హిందూకుష్‌పర్వతములకు గొంచెముత్తరముగ నుండిన నవసంఘారామమున గౌతమబుద్దుని స్నానపాత్రమును, దంతమును బదిలపరుపబడియున్నవి. బాల్‌ఖ్‌రాష్ట్రమునకు