పుట:Bharatiyanagarik018597mbp.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజగృహమను నగరము రాజధానిగ నుండినది. ఇయ్యది మగధదేశము నందలి యానామముగల నగరమునకు బ్రతికృతి. గజ్ అను విభాగమున పెక్కువిహారములును, స్వరాస్తివాదులగు 300 మంది సన్యాసులు నుండిరి. బమియన్ రాష్ట్రము మిగుల ముఖ్యమైనది. ఇది లోకోత్తరవాదులగు బౌద్దులకు స్థానము. ఇచ్చట పరినిర్దాణబుద్దువిగ్రహ ముండినది. కపిశారాజ్యమున మహాయానశాఖీయు లుండిరి. క్షత్రియుడగు నిచటిరాజు లంపాక, నగరహార, గాంధారములపైగూడ నధికారమును నెరపుచుండెను. 'ఈత్‌సింగ్‌' అను మఱియొక చైనాయాత్రికు డీ బశ్చిమోత్తరభాగములనుండి యనేకు లార్యావర్తనమునందలి పుణ్యక్షేత్రముల కేగుచుండిరని వ్రాసియున్నాడు. బుద్ధగయలో నమర్‌ఖండ్, టొఖరిస్థానము, కపిశామున్నగు దేశముల ప్రజలు దమ దేశీయులగు యాత్రికులసౌకర్యములకై వసతులను గట్టించిరట.

క్రీ. శ. 7 వ శతాబ్దినాటికి యీఆఫ్‌గనిస్థాన ప్రాంతమున బౌద్ద మతమేగాక నితరమతములుగూడ వ్యాపించినవి. వీనిలో శైవమతము ముఖ్యమైనది. గాంధారదేశమున దొరికిన యొక ఖరోష్ఠిశాసనమునుండి యచ్చట ఉరుమజుని పుత్రుడగు మొయికుడను నతడు కుషాన్‌రాజగు రెండవకాడ్ ఫెసిస్ కాలమునందొక శివాలయమునకు దాన మొసంగెనని తెలియుచున్నది. ఈకుషాన్‌రాజు నాణెములపై నొకవైపున శివునిప్రతిమ గలదు. బౌద్దమతధ్వేషి యగు మిహిరగులుడు శైవమునెడ నాదరమును జూపెను. కాన హ్యూన్‌ష్వాంగ్ కపిశారాజ్యమున పెక్కుబ్రాహ్మణదేవాలయములను, పాశుపత, కాపాలిక శైవులను గాంచెను. ఇట్టియాలయములు లంపాక, నగరహార, జొగుడ, అంతరాబ్ మున్నగు రాష్ట్రములలోగూడ నుండెడివి.

ఇస్లాము విజృంభణము :- 7 వ శతాబ్దిలో ఆఫ్‌గనిస్థానమును చైనాటిబెట్‌దేశీయులును, మహమ్మదీయులగు నరబ్బులును వరుసగా