పుట:Bharatiyanagarik018597mbp.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శకరాజులు :- వీరు యవనులను జయించి భారతదేశబశ్చిమోత్తరభాగమున కదిపతులైరి. పిమ్మట యూఏచీ తెగకు జొందిన కుషానురాజులు వీరినణంచి తాము ప్రబలిరి. వారిలో నగ్రగణ్యుడగు కనిష్క చక్రవర్తి కాలమునం దిప్పటి ఆఫ్‌గనిస్థానములోని కాబూల్, కాందహార్‌లును, గాంధారమును - మద్య ఆసియాలోని కాష్‌ఘర్, యార్‌ఖండ్, కోటానులును కాశివరకునుగల యుత్తర హిందూదేశమును గలసి యొక మహాసామ్రాజ్య మేర్పడెను. ఈసమయమునందిట ననేక నాగరికతలు కలసినవి. కనిష్కునిచే బునరుద్దరింపబడిన బౌద్దమతము బశ్చిమోత్తరముగ వ్యాపించి, యటనుండి బ్రాగుత్తరముగ మధ్యఆసియాను బ్రవేశించినది. గాంధారమున నొక క్రొత్తశిల్పపద్దతి బయల్వెడలెను. ఆఫ్‌గనిస్థానమున గనుగొనబడిన స్థూపములపై శాసనములనుండి థియోడోరస్ అను నొక యవనోద్యోగియు, వెస్‌పేసి కపిశామండలముల పాలకులునుగూడ నీకాలమున బౌద్దులైయుండిరని తెలియుచున్నది.

దీనినుండి ప్రాచీనకాలమున భారతవర్షము సింధునదికి బశ్చిమమున, హిందూకుష్‌పర్వతముల కావలివరకునుగూడ వ్యాపించియుండెనని స్పష్టమగుచున్నది. క్రీ. శ. 11 వ శతాబ్దము వరకునుగూడ బ్రకృత ఆఫ్‌గనిస్థానములోని ప్రాగ్బాగమంతయు నుత్తరాపథముగనే బరిగణింప బడుచుండెడిది.

ఆఫ్‌గనిస్థానమునందలి బౌద్దనిర్మాణములు :- ఒకరి వెంబడి నొకరుగా నేగుదెంచిన యనేక విజేతల ధాటికినశింపగా మిగిలిన బౌద్దశిధిలము లెన్నియో యిచ్చటగలవు. ఈ విషయమున బ్రకృత జలాలాబాద్ మైదానము ముఖ్యమైనది. దీనికిబూర్వము నగరహారమనిపేరు. ఇచ్చటి కైదుమైళ్ళదూరములోనున్న హద్ద యనుచోట నొకచక్కని స్థూపముగలదు. ఇయ్యది బుద్దదేవుని పుఱ్ఱెయెముకపై నిర్మింపబడినది. ఇందుగాంధార