పుట:Bharatiyanagarik018597mbp.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జపానుదేశ జీవితమునకు నూతనోత్తేజమును గల్పించిరి. 8 వ శతాబ్దమున నాదేశమున వైదుష్యమును, శాంతిసౌఖ్యములును బ్రబలినవి. సుభాకరసింహ, అమోఘవజ్రాదులచే బ్రవర్తింపబడిన మాంత్రికవాదమును, అనంగభిక్షుని ధర్మలక్షణవాదమునుగూడ నీదేశమున కేతెంచినవి. ఈ ప్రచారమునకు ఫలితముగ 9 వ శతాబ్దమున జపానుదేశీయులే బ్రత్యేక పరిశ్రమమొనర్చిబౌద్దమతమున నూతనసిద్ధాంతములను బయల్వెడలించిరి. 'టెండెయ్‌' ('Ten-dei') 'షిన్ గన్‌' (Shin-Gon) అను శాఖ లిట్టివే. 12 వ శతాబ్దినాటికి తాత్విక బహుళముగాక సుగమమును మనోరంజకమునగు మత మవసరమైనది! దానికి ఫలితముగ 'సుఖవటి' యను నొకసిద్దాంతము బయల్వెడలినది. దీని ననుసరించి తత్వమును, యోగమును, నిష్ప్రయోజకములు. అమితాభయసు దైవమునందు నిశ్చలమగు నమ్మకముండినచో ముక్తి సులభ సాద్యమగును. అంతియేగాక బౌద్దమతమునకు బూర్వ మీదేశమునందు----------' మతమునగూడ గొప్పపరివర్తనములు జరిగినవి. అమతావలంబకులు తమదేవతలను బుద్దుని యవతారములుగ బరిగణింప మొదలిడిరి.

(5) బర్మా :- క్రీస్తుశక ప్రారంభముననే భారతీయులకు బర్మాదేశముతో బరిచయముండినటుల దెలియుచున్నది. క్రీ. శ. 78 లో ప్రపంచమంతను చుట్టివచ్చిన యొకగ్రీకుదేశీయుడు ఆఫ్రికాఖండమునుండి హిందూదేశముమీదుగాచైనా దేశమువరకును వర్తకముజరుగుట కనుకూలమగు మార్గముండెడిదని వ్రాసియున్నాడు. బర్మా యీమార్గముననే గలదు. 3 వ శతాబ్దమున హిందూదేశమునుండి అస్సాం బర్మాలమీదుగా చైనాకు మార్గముండెడిదని చంపాయను హిందూరాజ్యములోని శాసనములనుండి తెలియుచున్నది. 5 వ శతాబ్దమున భారతదేశమునందు గుప్తరాజుల పరిపాలనమున హిందూమతమపూర్వమగు నభివృద్ధి నందినది. ఈ సమయముననే ఆశియాఖండమునందలి ప్రాగ్దక్షిణదిశను అస్సాం చైనాలకు