పుట:Bharatiyanagarik018597mbp.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మధ్యనుండు ప్రకృత ఇండోచైనాలో చంపా, కాంభోజయను, హిందూరాజ్యములు నెలకొల్పబడినవి.

బౌద్దగాథలలో అశోకచక్రవర్తి బర్మాకుగూడ మతప్రచారకులను బంపెనని వ్రాయబడియున్నది. ఈ దేశమున దొరకిన 5 వ శతాబ్దినాటి 'పూ--' శాసనములనుండి యంతకు రెండు మూడు వందల సంవత్సరములకు బూర్వమే యిచ్చట హిందూమతము వ్యాపించె ననియు' నిచ్చటి వారలు సంస్కృత ప్రాకృతములనుండి కొన్ని మాటలను తమభాషలోనికి దెచ్చుకొనిరనియు, దెలియుచున్నది. అటుపై మహాయానబౌద్దమతము గూడ బర్మాను బ్రవేశించెను. క్రీ. శ. 450 లో హీనయానబౌద్దమత ప్రచారకుడగు బుద్దఘోశు డీదేశమున మతబోధ నొనర్చెను.

(6) నయాం :- కాంభోజ దేశమునుండి హిందూ బౌద్దమతము లీదేశమును బ్రవేశించినవి. అంతియగాక భారతదేశమునుండి విజ్ఞానకృశి చేయుడకై యేతెంచిన బ్రాహ్మణులును, వర్తకమునకై వచ్చిన వణిజులునుగూడ నీ మతప్రచారము నొనర్చిరి. నయాందేశమునందలి మతము, భాష, సంస్థలు, లిపి, కళలు, వాఙ్మయము మున్నగు - నవన్నియు హిందూదేశమునుండి పరిగ్రహింపబడినవే.

(7) కాంబోడియా :- ఈదేశము బర్మాకును, చైనాకును మధ్యనుండి ప్రకృతమునం ఇండోచైనా, యని పిలువబడు భాగమున నయాంకు దక్షిణమునం దున్నది. క్రీ. శ. 1 వ శతాబ్దమునం దొకపర్యాయమును, 4 వ శతాబ్దిలో నింకొక సారియు హిందువులు మాతృ భూమినుండి యీదేశమునకు వలసవచ్చిరి. ఇచ్చటి శాసనములనుండి 7-13 వ శతాబ్దములలో నిచ్చట సంస్కృత భాషయు, దేవనాగరీ లిపియు వ్యవహారమునం దుండెడి వనియును, హిందూ దేవాలయము లనేకములు నిర్మింప బడిన వనియును దెలియుచున్నది. 5 వ శతాబ్దమునం దిచ్చటి జయవర్మయను రాజు నాగ