పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4 [ అం 1

భారత రమణీ

సారులు చితికి పోయినారు, ఎంతమంది గౌరవమో హీన మయినది. ఇది అన్యాయము కాదా?

సదా-- ఓయీ ! నీకు పుత్రులున్నారు, పుత్రిక లున్నారు. వారి భరణ పోషణములకు బాధ్యుడవు నీవే కదా? పుత్రులను ఇరివదియైదేండ్ల వరకు ఫేంచుదువు, కాని పుత్రికలకు పదేండ్ల పైబడిన తోడనే వారి భరణపోషణ భారము వరుని నెత్తిపై నెత్తుదువు. కొడుకులతో బాటు కూతుళ్లను కూడ తక్కిన పదునైదేండ్లును నీవు పోషింపనక్కరలేదా? అదిగాక ఆస్తినంతయు కొడుకులకు చెందజేసి ఆడపిల్లలకు చిల్లిగవ్వయైన అందనీయవు. కొడుకులతో సమముగా కూతుళ్లను నీవుచూడకుండుటకు వా రేయేటిలోనైన కొట్టుకొని వచ్చినారా? చేతనైనంత శీఘ్రముగా వారిని చేవదల్చుకొన జూతువు. కావున ఆడపిల్లల కన్నవారే అన్యాయమున కొడిగట్టుచుండ, అట్లు చేయదగదనియు, వారిని మగ పిల్లలతో సమముగా చూడవలయు నని సంఘము నిర్భంధించు చున్నది. అపరాధము చేయునది నీవు, దానిని సంఘమునెత్తిపై రుద్దెదవేల ?

  దేరే-- నాకూతుళ్ల విషయమున నేనట్లు ఛెయదలచు కొనలేదు. నాశక్తి కొలది వారి కెద్దియో ఒసంగుదును. ఇంత యిమ్మని వరుని తండ్రి పట్టు బట్టనేల ?
  సదా-- అట్లు నిర్భందింపని యేడల తగినంత ధనము