పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రం 1] భారత రమణి 3

దేవే-- అదే. దానిని ఏతలమాసినవానికో కట్టిబెట్టవీలులేదు. చద్వుకొన్న పిల్ల, తెలివైనది.

సదా-- పెద్దది కూడా చదువుకొనినట్లే యున్నది. ఒక నాడు హితోపదేశములోని శ్లోకమొకటి చదివినది.

దేవే--అవును, ఒక పిల్లకు సంస్కృతము, రెండచ్వ దానికి ఇంగ్లీషును మాతండ్రిగారు చెప్పించినారు. రెండు విద్యల పరిణామ మెట్లుండునో చూడవలయునని వారి యూహ.

సదా--సరే. మూడవది ?

దేవే-- అది చాలా చిన్నది, దానికెప్పుడును రోగాలే. పద్దదాని పెండ్లి తొ నాపేర్మి తగ్గినది, సంపద సన్నగిల్లినది. ఇప్పుడు రెండవదనికి పెండ్లిచేయక తీరదు. అదే గట్టిచిక్కొచ్చినది.

సదా-- దానిపెళ్లికి చిక్కేమి ? పిల్ల రూపవసి, చదువుకొన్నది, తెలివైన దేమో ?

దేవే-- కావుననే చిక్కు ఇప్పటి వరులతండ్రులు కోడళ్ల యందము చందమును చూఛుట లేదు. తమ సుతుల నడిబజారున పెట్టి ఎక్కువవెల యిచ్చినవారికి అమ్ముచున్నారు. దిక్కుమాలిన మన సంఘమున్ ధనహీనులు తమకూతుళ్లకు పెళ్లి చేయుట కదుప్రయాసముగా నున్నది.

 సదా-- సంఘమును నిందింపకు, అది చేసిననేరమేమి ?

దేవే--ఆడపిల్లల పెళ్లిళ్ల మూలమున చాలమంది సం