పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
భారత రమణి                              [అం]  

సదా-- ఆర్జనపరుడగు సుతునకు ఆస్తి నంతయు నిచ్చి, అర్భకునకు అప్పు తలజుట్టిరా, మీతండ్రిగారు ?

దేవే-- దానికేమి ? స్వార్జితమును వారు ఇచ్చవచ్చినట్లు పంచవచ్చును, ఆక్షెపమేమి ? అందరికీ పిత్రార్జిత ముండునా ? ఆ విషయల్మున నా కేచింతయు లేదు.

సదా-- అతడొక అపూర్వ వ్యక్తి, నీకెందుకు సుతానము ?

దేవే--ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు.

సదా--కొడుకు లేమి చేయుచున్నారు ?

దేవే--పెద్దవాడు సన్యసించెను, చిన్నవాడు చదువు కొను చున్నాడు.

సదా--కూతుళ్లఖూ ఫేండ్లి చేసితివా ?

దేవే-- పెద్దది తలచెడ్డరి. తగినంత కట్నము నీయ లేనందున తగినల్లుడు దొరకలేదు. మా వియ్యఖుడు కడుబీదవాడగుటచే పిల్ల మాయొద్దనే ఉన్నది.

సదా-- రెండో పిల్ల ?

దేవే-- దానికే వరుని వెదకు చున్నాను. అది బి.ఏ. పరీక్ష నిచ్చినది.

సదా--ఓహో ! మావినయునితో నాడుకొనుచుండునది ఆపిల్లేనా ?