పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
భారత రమణి

నీవీయవు. నీపిల్లను యావజ్జీవము భరించు భారము వారిదే కదా ? తోచినంత యిత్తునని నీ వేతృణమో వారికిచ్చినచో నీ కూతురిని వారు తగినరీతిని పొషింప గలరా ?

దేవే-- సరే, నేనిచ్చిన ద్రవ్యమును వారింకొక విధమున కాజేసిన ?

సదా-- అబ్బో ! నీవే యెగవేసిన?,,,, వారెట్లు కావించినను, కోడలికి యావజ్జీవము అన్నవస్త్రములు నిచ్చు బాధ్యతను వహించియుందురు కదా ? పెండ్లివారు వారు నిన్ను నిర్భంధింపకున్న అ వెన్క నీవు పెట్టుపోతల సరిగా జరుపుదువో జవపవో ? ముందు జరుగబోవునది ఎవరు నిశ్చయింప గలరు ? "లగ్నము నాటి మాటలు నాగవిల్లినాడుండవు" అందుచే పెళ్లినాడే పిల్లతండ్రి యొద్ద తగినంత ధనము పుచ్చుకొనుట అవశ్యకము.

   దేవే--నా శక్తికొలది నేను కట్న మిచ్చెదనన్న, వారు తృప్తి నొందక  నా యిల్లు గుల్ల చేయ నేల ?
   సదా-- వారు నీ నెత్తికొట్టి నీ సర్వస్వము నపహరించుట లేదు. నీవే వారి కొసంగ బోవుదువు.
   దేవే-- ఏమి ఛెయుదు ? కన్యను గన్న ఋణము తీర్వవలదా?
     సదా-- కన్యకు వివాహము చేయుట తప్ప దంటివి; కాని ఆమె కన్నవస్త్రములకు ఆధారము కల్పించుట తప్పని