పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారత రమణి

సరికాక నీ యిష్టానుసార మంతివి: అట్లైన నీశక్తికి తగిన చవక బేరమునకు నీవు పొమ్ము, అట్లు చేయక అల్లుడు పెద్ద పెద్ద పరీక్షల నీయవలె ననియు, ధనము నార్జించిలక్షాదికారి కావలెనని నీ యాశ; అట్టివాని తండ్రి ఐదారువేలు కట్నమిమ్మన్న అది తప్పా? చిన్న పరీక్షల నిచ్చినవారు వేనవేలు వేయిరూపాయిలను కుదురుదురు, అట్టివారికి నీ పిల్ల నేల ఈయగూడదు? ఇంకొకటి-- వారు నీపిల్ల రూపసి, తెలివితేటలు కలది, చదువుకొన్నది అని కట్నము తగ్గింతు రేమో?

దేవే-- ఎట్లైనను వివాహ మన వరవిక్రయము కదా?

సదా-- "విక్రయ" మన్నమాట చెడ్డదే, కాని ఈ లోకమున అన్ని దేశములయందు నిట్లే జరుగుచున్నది. కొడుకుల నమ్మి ధనము కూర్చువారు కూతుళ్ల అళ్లికి గొప్పగొప్ప శుల్కముల నర్పింతురు. పుచ్చుకొన్నవాని కిచ్చినది చెల్లు అందుచే కొడుకుల నెక్కడు కన్నవారికి లాభము; కూతుల నెక్కుడు కన్నవారికి నష్టము. ఇంత యేల ? సృష్టియందే ఇట్టి వైషమ్యము కనబడుచున్నది. ఒకడు లక్షాధికారి, ఇంకొకడు భిక్షాధికారి; ఒకడు బుద్దిమంతుటు, ఇంకొకడు మూర్ఖుడు; ఒకడు బలవంతుడు, వేరొకడు బలహీనుడు. ఏమి చేయూనగు ?

దేవే-- అంతేనా ? ఇక నెరవు లేదా ?

సదా-- నీకు లేదు, కాని నీపిల్లలకు లేకేమి? చిన్నప్పుడు వారికి పెండ్లిసేయకు; ధనము నార్జింపగల దార్ధ్యము,