పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 1]

7

భారత రమణి

మానవుల త్రిప్పుకొను సోర్సు, బాలకులకు అలవడకముందు సంసారభారం వారి నెత్తిపై కెత్తకు. ఈ బాల్యవివాహములే మనజాతికి శీర్ణతయు, శైధిల్యమును ప్రసాదించినవి. ఇట్టి మహోపకారమును ఇంకే అనాచారము చేయుటలేదు. హిందువుల కింత హానికరమగు దురాచారము ఇంకెద్దియు కాదు.

దేవే--ఓహో ! సనాత నార్యధర్మమును తారు మారు చేయునెంతునా?

సదా-- ఆహా అవశ్య మట్లే చేయనెంచితి, ఏలయన, ఆధర్మము లోపబాహుళ్యమున శిధిలము కాకున్న మనజాతి కిట్టి దుర్ధశ ప్రాప్తించి యుండదు. మన ఆచారద్రుమములు కేవల ధర్మరశ్మిసోషితము లనజెల్లదు. అధర్మము బదనిక రూపమున వాటియందు వేళ్లు తన్నియున్నది, దాని కూడ బెరకవలయును.

దేవే-- గట్టి చిక్కే తెచ్చిపెట్టితివే?

సదా--నీ సంగతి ఆలోచించుకో- నీకు బాల్యముననే వివాహము కాకున్న, నీ గతి యిట్టి హీనస్థితికి వచ్చియుండునా? నీకీ విధమదశ ప్రాప్తించి యుండునా?

దేవే--బాలకులకు చిన్నతనమున పెండ్లి చేయగూడదు, సర్: బాలికలకో?

సదా-- వివాహ యోగ్యమగు వయసున మంచి