పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
భారత రమణి

వరుడు లభించెనా; వారికి పెండ్లి చేయవలసినదే.

  దేవే-- అట్టి వీలు చిక్కకున్న ?
  సదా-- పెండ్లియే వలదు. బ్రహ్మచర్యమున వారి నుంచవలయు. బాల వితంతువులు బ్రహ్మచర్య మాచరింప గల్గినచో, అవివాహితులు మాత్ర మాచరింప జాలరా ? వీరు ఛెయజాలరని అందువా, వారును చేయలేరు. కావూ కన్యలతో బాటు వితంతువులకు పెండ్లి కావలసినదే!
     దెవే-- నీ అభిప్రాయము నాకు తేటతల్లము కాలేదు.
    సదా-- చెప్పిన నాలకింపుము, యోగ్యుడగు వరున కిచ్చి పెండ్లి చేయ శక్తియున్నచో, కన్యకైనను వితంతువునకైనను వివాహహముచేయ దగును. అట్టి సామర్ధ్యము లేనిచో ఇల్లు వాకిలి నమ్మి వారిలో నెవ్వరికిని పెండ్లి సేయవలదు. ఇద్దర్కు బ్రహ్మచర్యమే గతి.
  దేవే--దాని వలన కీడు మూడదా ?
   సదా--ఆపజ్జనకము కాని ఆచారము ప్రపంచమున నెచ్చటనైన కలదా ?
  దేవే-- లేదు, నిజమే, కాని క్రొత్త యాపద నొక దానిని తెచ్చి పెట్టుచుంటివే ?
   సదా--వితంతువులకు పెండ్లి చేయుటచే కొంత ఆపద తగ్గుట్ లేదా? దేవేంద్రా ! మన దేశమున ధనవంతులు తక్కువైనను, ఉపజీవుల సంఖ్యను హెచ్చించు ఇచ్చ అన్ని