పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారత రమణి

దేశములకంటే ఇచ్చట ప్రబల మగుచున్నది. జారిద్ర్యమున మున్గియున్నవారి దరి కెవ్వరు చేరరు గాని, "తప్పులుగ్స చెరువు నిండిన, కప్పలు పదివేలు చేరు" అన్నట్లు ఏదో సంబంధము కల్పించుకొని ధనికులకొంపకందరు చేరుదురు. ఒక కవి భారత రమణుల నుద్దేశించి ఇట్లు ప్రార్ధింంచెను:-

   "కాంతలార మీరు కనబోవు డెన్నడు
    బలము వీర్యములేని పంద సుతుల."

కాని ఇందు స్త్రీలు దోషులు కారు, పురుషులే దొషులని అతడూహింప లేకపోయెను...దేవేంద్రా! బాల్య వివాహము వేగ మాని వేయ వలెను. దీనివలన ఇతరాచారములనేకములు జీర్ణము లగుచున్నవి. వాటిని కూడ సంస్కరింప వలయు, కాని మొదట దీనిపనిబట్టవలయును. బాల్య వివాహముల మూలముననె మనజాతి మజ్జాబావమున దుర్భలమై, అహారశూన్యత శీర్నమై, బలరాహిత్యమున భీరువై, ఉత్సాహవిరహత నిరర్ధక మగుచున్నది. మనలో ఇంతకన్న నష్టహేతువరు ఆచార మెంకెద్దియు లేదు...(నిట్టూర్పు)

దేవే--ఊరకుంటి వేమి?

సదా-- ఇక మాటాడజాలను..(పోవువు).

దేవే--ఇప్పటికి నీతని స్వభావ మప్పటిలాగుననే ఉన్నది. ఆహా! ఇతని జూచి ఎంతకాలమైనది ? పది సంవత్సరముల్కు తక్కువ్ కదు. బాల్యమిత్రుల జూడ బాధలు తగ్గును. హృదయతాపము చల్లారును, చిన్ననాటి దినములు