పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యాదికి వచ్చును. ఆ దినములలో సదానందుని శిరముతో నాశిరము జేర్చి, అతని బాహువులతో నాబాహువులును కీలించి, నిస్సంకోచముగా మరుగు విడిచి మాటలాడు చుంటిని. ఆహా ! శైశవ మెంత మధురము! అప్పుడు శరధ్రాకచ్ంద్రకల జూచి ఊలుకు పలుకు లేక ఉప్పొందు చుంటిమి, వర్షర్తుమేఘగర్జనముల విని గెంతుచుంటిమి, గ్రీష్మరాత్రుల నిర్మలనక్షత్రపుల్ కితనభస్సోభ గాంచి, చీకట్లుక్రమ్ముకన్నుల ఆనందభాష్పవారి చిమ్ముచుంటిమి; అట్టి రమణీయ దినము లికరావు. అప్పుడు "రేపెట్లు గడుచును? కొడుకులకు చదువు చెప్పించుటకు, కూతుళ్లకు పెండ్లిసేయుటకును ధనమెట్లు కూడబెట్టుదును?" అను చింతయే లేకుండెను. "గతకాలంజు మేలు వచ్చుకాలము కంటెన్ "

               కేదారుడు వచ్చును.

కేదా-- వాడు వదలడు.

దేవే-- ఏమిటి?

కేదా-- ఈయిల్లు, అసలు పుచ్చుకొను గాక, వడ్డికూడబెట్టునట...నేను బారిష్టరు దగ్గరికి పోయెద, (ఫోబోవును)

దేవే--ఎక్కదికి పోయెదవు?

కేదా--బారిష్ట రింటికి.

దేవే-- కొంచమాగి పొమ్ము

కేదా-- వ్యవధి లేదు.