పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారత రమణీ

దేవే-- దాహము పుచ్చుకొనుము.

కేదా-- ఆలస్య మగును.

దేవే-- వేళ--

కేదా-- మించినది. రేపు వచ్చేద- ఇదుగో -చూడు.... కాదు, ముందాలోచించవలయు. ఇం దేదో మోసమున్నదని నానమ్మకము.

దేవే--దేని యందు?

కేదా--కానీ... వెనుక చెప్పదను.. (పోబోవును)

                 మానద వచ్చును.

మాన--వంటయినది, స్నానము చేయుడు... నవ్వెద రేమి?

దేవే--కేదారుడు వచ్చెను.

మాన--ఐన నేమి?

దేవే-- పాపము ! నాకప్పగించిన ఋణమునకు వడ్డీ మూడువేల రూపాయి లయినది. అప్పిచ్చువాడు వడ్డి వదలునా? వ్యర్ధప్రయాసము నెత్తిపై పెట్టుకొన్నాడు కేదారుడు.

మాన-- మీకిదితప్ప వేరు చింతయే లేదా? లెండు, స్నానము చేసి భోజనమునకు లెండు.