పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
68

అం 2]

భారత రమణి

(మానద వచ్చును)

ప్రాణేశ్వరీ ! నే డుత్సవదినము, మన మానందింప వలయును.

మాన-- ఏల?

దేవే-- నేను బంధముల తెంచుకున్నాను. సంఘమను తాడును సడలించు చున్నాను. పంజరమును చేదించి బయటికి పరుగెత్తుచున్నాను. నావెంట నీవుగూడ వత్తువా?

మాన-- ఎటకు?

దేవే--(పైకిచూసి) అటకు, నీలాకాశతలమునకు, అంశుమంతుని ఆలయమునకు, పరమపవిత్రమగు వాయుమండలమునకు-- సదానందుని తన యునకు సుశీల నిచ్చి పెళ్ళి చేసెదను.

మాన--ఎవరికి?

దేవే--సదానందుని కుమారుడు వినయునకు

మాన--నిశ్చిత మైనదా?

దేవే-- ఆహా, సునిశ్చితము. ఇదివర కించుక సంశయముండెను. కాని అన్నగారి సందర్శనమున అదీ తీరినది. ఇక నీవు పెండ్లిపనులు సాగింప వచ్చును.

మాన--నాధా! నేడు సుదినమే! ఇంతకన్న సుఖ దాయక మగువార్త ఊండబోదు. సుశీల కిది సమ్మతమే.

దేవే--నీకు?