పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 1]

67

భారత రమణి

కలుకోసి, సంగడిగాండ్ల పచ్చనికొంపలు మాపి, మెత్తని వారి సొత్తును హత్తుకొనువారు, వంచకులు, వేషధారులు-- ఇట్టివారు సంఘముచే సాదరముగా సమ్మానింపబడుచున్నారు. పతితులగువారు పరమధార్మికులయి ప్రజ్వరిల్లుచుండ, విద్యాసాగరుని వంటి వివేకులు వెలివేయ బడుచున్నారు. అట్టిచో వెలికి వెనుదీయ నేల?

ఉపే-- నీవు శాస్త్రాధ్యయనము సేయలేదు. నేనూ శాస్త్రములనన్నిటిని చదివితినని విఱ్ఱవీగను. ప్రధానమైనవాటిని పఠించితిని.

దేవే-- మీరు చదివినందుకు ఫలము ప్రత్యక్షము కాలెదా? సంఘములో నున్నను సంకటములు తప్పవు. దానిని వీడిననూ సంకటములు తప్పవు. ఈ రెండుమార్గములలో నొక దాని నెంచుకొనవలయును. నేనురెండవదానిని నెంచుకొంటిని. మీరు నాకేమియు బోధింపనక్కరలేదు. వైష్ణవసంప్రదాయానుసారులగు మీ భక్తబృందమును తరింపజేయుడు. ఇక దయసేయుడు.

ఉపే--సరే నీ యిష్ట మెట్లో అట్లే ఒనర్చుము. మధుసూదనా! గోవిందా ! మురారే!.... (పోవును)

దేవే-- ఈ విషయమున నింతవరకూ నాకించుక సంశయ ముండెను, కాని ఈతని ఆచరణమున అది నివృత్తిమయ్యెను. బ్రతికితిని.