పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
58

[అం 1

భారత రమణి

చవలసి యుండున్. నిజము పల్కిరి. ఏమి కదులుదురా?

హరి--యిదికేవల మన్యాయము. గౌరవనీయులయెడ కారుకూతలా?

కేదా--నోరుమూసుకొనుము, మీరందరును కుక్కలు, పందులు, గాడిదెలు, పరోఅజీవి కీటకములు, పోదురా? లేక దుమ్ములువిఱుగ పొడువనా?

శంక--ఏమయ్యా! వరుసపెట్టి అందరిని తిట్టుతున్నావు

కేదా--ఊరొకో గుడ్లగూబా !

శంకా-- నేను గూబనా?

యజ్నే--శంకరా, ఊరుకుండుముజ్, కయ్యమునకు కాలు దువ్వకు.

శంక--ఇంకొకసారి అననీ--

కేదా-- ఒకసారి కాదు, నూరుసార్లంటాను, గూబా! నాకాలస్య మగుచున్నది. సదానందా! నానేరము లెదు, తాటిటెంక లాగు తలా నీవు లేవవేమిరా? తన్నులు కావలెనా? (కాలియజ్నేశ్వరుని పొడుచును)

యజ్నే--నన్నుపొడిచెద వేమిరా?

కేదా-- తెలియలేదా? ఇదిగో(తిరుగ పొడచి) ఇప్పుడు తెలిసినదా? ...లే...అన్నలారా! కఱ్ఱ లెత్తుడు.