పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 5]

59

భారత రమణి

యజ్నే-- సరే- పోవుచున్నాను కాని దావా తెచ్చెదను. ఊరుకొనను. చూడు నాదెబ్బ! (వెళ్ళును)

భక్తు-- (వెళ్ళుచూ) చూడు మాదెబ్బ.

కేదా--చూచెద లెండి. పిచ్చికుక్కల్లారా! ఈ పింజారిక్కడ యజ్ఞేశ్వరుడు నేడో రేపో చావనున్నాడు. వీనికి పెళ్ళి కావలెనట; ఇంకొక క్షణ మాగిన పెద్దపెళ్ళి చేసి పంపుదును. మహర్షిసత్తమా! భక్తగణము పారిపోయినది. చిరిగిన గుడ్డ పీలిక వలె మీరిచట జీరాడ నేల? అనుష్ఠానసమయ మాసన్నమైనది. ఆశ్రమమున కరిగి భగవద్గీతా పారాయణ మొనర్చుడు.

ఉపే-- నీదౌష్ట్యమునకు కారావాసమే శిక్ష !(పోవును)

కేదా--ఒకసారి కాదు. లక్షసారు లేగుటకు సిద్ధము,కర్తవ్యము నిర్వర్తించితి. తత్ఫలము దైవాధీనము.

సదా--కేదారా! ఎందరో గీతలను చదువుచుందురు- నీవో వాని నాచరణమునకు తెచ్చితివి. ఏదీ, నీకౌగిలిమ్ము....

కేదా--ఇంక మూడు నిముసముల వ్యవధి యున్నది

దేవే-- కేదారా! ఎంత పనిచేస్తివి!

కేదా--నన్నేమియు ననవలదు, జగడము పెరుగును.