పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం.6]

57

భారత రమణి

కేదా--అంతయు ఆఖరున చెప్పెదను. ముందుగా యీ మహాత్ముని (అజ్నేశ్వరునితో) పెండ్లి కొడుకా, పొమ్మిటనుండి.

యజ్నే--ఏమి యీ దురంతము! దేవేంద్రా?

కేదా--నేను పొమ్మన్న మూర్ఖా పోవేమి?

దేవే--కేదారా, ఏమిది?

కేదా--నీ వూరకుండుము, లేకున్న కలహముతప్పదు. లేవవేమిరా! కుక్కా! పందిలాగ బలిసి నావు. పద యయటికి, లేకున్న కిరీటపూజ తప్పదు. ఒక కాలు కాటికి ఇంకొకటి నరకమునకును దాచుకొన్న నీకు పెళ్లి కావలెనా? పెద్దమ్మా- పద- బాలికా! నిర్భాగ్య దామోదరా!

యజ్నే--నన్నెందుకు తిట్టెదవు?

ఉపే--పెద్దమ్నుష్యులయెడ నీవిట్లు వర్రింప జెల్లునా? కేదారా!

కేదా--ఓహో ! మహర్షిగారా ! మిమ్ము చూడనే లేదు. ఏమిరా! లేచెదవా ? చెప్పుదెబ్బలు కావలెనా? ఊ లేవవేమి?

సదా-- కెదారా!

కేదా-- మాటాడ వలదని చెప్పితినె సదానందా! నాకు రెయిలువేళ మించుచున్నది.ఈ కాకీమూక నిక్కడ నుండి వెడలవడసిన గాని నేను వెళ్లను. మంచిమటలతో వీరు వెళ్లినచో చెప్పులు పడవు,లేకున్న కర్రలకు పని కల్పిం