పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
56

అం 1]

భారత రమణి

ప్పుడైన పల్లెత్తు పాడుమాట అంటినా? దేవేంద్రా ! ఈవివాహము మీ సుశీలకు సమ్మతమా?

దేవే-- నాకు తెలియదు

ఉపే-- కన్యకసమ్మతితో నేమిపని? ఎద్దునడిగి గంత కట్టుదురా?

శంక--గురువుగరు చెప్పుచుండిరే!

సదా--(ఉపేంద్రుని వైపు చూచి ఘృణ నగపరుచును) దేవేంద్రా! నీ కొమార్తెకు బాల్యముననే వివాహ మొనర్చియుండిన ఆమె సమ్మతి గొన నక్కర యుండదు, కాని పదునారువత్సరములు పైబడినవి. చచువుకొన్నది, కావున ఆమె సుఖదు:ఖములయెడ ఆమె సమ్మతిని గొనక పెండ్లిచేయుట భావ్యంకాదు.

యజ్నే--సదానందా! చూడు, ఈ శూకార్యమున కంతరాయము కల్పింతువేల? దేవేంద్రా! యావదృణమును వడ్డీతో వదలెదను.

సదా--ముందు కన్య అభిప్రాయమును కనుగొని రండు.

ఉపే--ఆమె మాత్రము వలదనునా? మా అభీప్రాయమే ఆమె అభిప్రాయము.

(కేదారుడు మరికొందరును కర్రలతో వత్తురు)

కేదా--ఆ సమయమునకే వచ్చినాము

సదా--కేదారా, వీరంద రెవవు?