పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 5]

55

భారత రమణి

సదా--ఉపేంద్రా నీవిట్లేల సలహా యిచ్చుచున్నావో నాకు బోధపడుట లేదు. నీస్నేహవాక్యములను తెఱమరుగున కౌటిల్య మమరియున్నదని నా నమ్మకము. నీ స్వరమును జూడ నీవు తడిగుడ్డతో గొంతుక కోయువాడవని స్ఫురించుచున్నది. ఎవరి కొంపమాపదలచితివి ? సుశీల గొంతుక కోయదలచితివా? అట్టి కృత్యము మాకు కల్పనాతీరము.

హరి--సదానందా, మహర్షిగారి నిటుల నిందించెద వేమి?

సదా-- మీకు జవాబు చెప్పనక్కరలేదు. మీరు క్షుద్రోపజీవులు... ఉపేంద్ర బాబూ ! నీ హృదయ మింత నీచమని నేనెరుగను, నేనొరుల నిందించువాడను కాను. నీబొటి తగుమనుష్యుని ఇంతకన్న నేమని దూషింపగలను? మంచి వేషదారివి ! మోసకాడవు!

నవీ--గురువుగారు..

ఉపే--నవీనా, ఊరకుండుము సదానందా పదిమంది నాయెడ భక్తిశ్రద్ధల నగపరచిన అది నా దోషమా? వృక్షపరిణతి ఫలమునుబట్టి యుండును. మంచి ఫలములను భుజించిన సరు భావృక్షమును కొనియాడిన, తప్పు దానిదా?

సదా--అయ్యా, క్షమించుము, దేవేంద్రునికి సోదరులై, వాని శుభోదర్కము నభిలషింప దగిన మీరే ఇట్టి సలహా నిచ్చినందుకు మిమ్ము నిందింపవలసి వచ్చెను. లోగడ మిమ్ము