పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
48

అం1]

భారత రమణి

లను గుచ్చి బాధేట్టి చంపకు. ఇంత వృధాప్రయత్న మేల? పెళ్లి యేవద్దు.

మాన-- అలా గనవచునా?

సుశీ-- విను నేను మీయిల్లు గుల్లచేసి, మీ సంసార సుఖమునకు గొప్ప వ్యాఘాతమును కల్పించివి నని, మీదు కుందవద్దు రేపురాత్రినుండి మీకంట బడను. భీతి వలదు-- నాకి పెండ్లివద్దని నాన్నగారితో చెప్పు- బలవంతముగా పెళ్ళి చేయలేరు. ఏలయన తత్పూర్వమే ఈకత్తిని చూచి తివా? దీనితో గొంతుక కోసుకొందును.

మాన--(చేయి పట్టుకొని) ఆట్ల నరాదమ్మా!

సుశీ--నేను చేయునది సిగ్గుమాలినపని యని నాకు తెలుసును. కాని ఏమి చేయుదును? నా కెందుకు దిక్కులెదు, రక్షకుడగు తండ్రి, తొడమీద జేర్చి దు:ఖముల బాపు తల్లి, తొడు నీడయగు తోబుట్టువు. సంతానము దీర్చు స్వజనము, వీరందదు నాయెడ విముఖులైరి! ఇంత మంది నాపై కత్తిగట్టినారు. కన్నత్రల్లి కంఠమునకు చమురు పూయ, కన్నతండ్రి కత్తి నూరుచున్నాడు. ఇక నాకు రక్షణము నేనే సల్పుకొనవలయును. కావున కత్తిని చేత బట్టితిని. అమ్మా, ఇటు విను నెనీ వివాహమున కొప్పుకొనను. తప్పని సరి యంటిరా తల ద్రుంచుకొనెద-

పోవును