పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 4]

47

భారత రమణి

[మానస వచ్చును]

మాన--అమ్మా ! సుశీలా ! ఒక్కర్తె నిక్కడ నెమి చేయుచున్నావు? కాలుసేతులు కడుగుకొని రమ్ము, జడ వేసెదను, పెళ్లికొడుకు వచ్చును.

సుశీ--వచ్చేవాడు వరుడు కాడు, యముడు అతని కొఱ కలకంకరించుకొన నక్కరలేదు. ఒడ లెంతబరువిఅన విడువడే యముడు.

మాన--ఇవేటి మాటలు?

సుశీ-- అమ్మా, నావలన మనయింటికి కీడుమూడ నున్నదా?

మాన--అట్ల నుచుండి వేమి?

సుశీ--లెకున్న, నన్ను వెళ్లగొట్టుటకు విశ్వప్రయత్న మేల? సొమ్మన్న నేనే పోదుననే.

మాన--నీకు మతిపోయిన ట్లున్నది.

సుశీ--నాబుద్ది సుంతయు చెడలేదు. అట్లైనచో నేను దీనిని గ్రహిచుటెట్లు? అమ్మా! నీకు వింతగా నున్నదా? (లోన నుండి కత్తిని తెచ్చి) ఇఅంత ఆర్భాట మక్కరలేదు. దీనితో నొక్కవేటు చాలును-కానీ!

మాన-- ఇదేమి?

సుశీ--ఒక్కదెబ్బతో తెగ నరుకుడు ముక్కలు ముక్కలుగా చిత్రవధ చేయకుండు. మీకన్న కసాయివారు మేలు, ఒకదెబ్బతో నరికి చంపును, శరీరము నిండ శూలము