పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
46

అం 1]

భారత రమణి

లతో వారి కన్నము వడ్దించుచుందును. వారిమతి చెడినది. మనగతికి కుందుచూ తలా తోకా లేనిమాట లాడుచుందురు. వారి యారాట మంతయు నేను గాంచుచుందును. నీ వెరుగరు.

సుశీ--కుడిచి కూర్చుండి వారిట్లు కుందనేల?

వినో--నీ కిప్పుడు బోధపడదు, ఇకముందు బోధపడ గలదు. నీ మానస మిపుడు స్వార్ధలహంకారాంధతమ సంబునె నిబిడముగ వాచ్చారింపబడి యున్నది. త్యాగసూర్యుడు నీ చిత్తాకాశమున నుదయించిన తోడనే ఆహమిక యను పొగమంచు విరియబార, స్వార్ధమను ధ్యాంత మంతరింప, అప్పుడు వారి యంతరంగము నీ కవగతమగును.

సుశీ--తండ్రిగారు నన్ను బాగుగ నెరుగుదురు. ఎవరేది చెప్పినను నా చిత్తానుసారము వర్తించు ఆబాధ్య పుత్రిక నని పలువురతో పల్కుచుందురు. నా స్వభావమునకు ప్రతి కూలముగా సంచరించుట నాకు సాధ్యము కాదు. సంఘమునకు బలినగుటకు సమ్మతింపను. ప్రాణముండిన పోయిన పంతమిదియ.

వినో-- నీ కెవరు చెప్పగలదు ? (పోవును)

సిశీ--కాంతను భార్యగా పురుషున కర్పించుట దాసత్వమను త్రాటితో దాని మెడకురిపోయుటే... బలవంతముగా నాకు పెండ్లిసేయ నెవరు సాహసింతుతో చూచెద గాక!