పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 4

45

భారత రమణి

సుశీ-- ఏల?

వినో--వినయుడు నిన్నంత ప్రేమించునోనీకు తెలియలేదు. చేత జిక్కిన స్వర్గమును ధూళివలె ఎగురజిమ్మేనే- కర్తవ్యనిరహణార్ధము...నీ తండ్రియెడ నీ వొనర్పవలసిన దానిని నీవే నాచరింప జేయుటకు... అది నీకు బోధపడలేదు.

సుశీ-- నా తండ్రియెడ నేనెట్లు వర్తింపవలయునో నేనెరుగుదును. ఒకరు నాకు చెప్పనక్కరలేదు.

వినో-- నీ వేమియు నెఱుగవు. చెప్పినను నీకు బోధ పడదు. ఇంగ్లీషు చదువువల్ల నీకబ్బినది అహంకారమొక్కటే ఇంకేమియు అబ్బలేదు.

సుశీ--నీ యుపన్యాసమును ఈపాటి కట్టిపెట్టి దయ చేయుము.

వినో--తండ్రిగార్కి నీపై ప్రేమ లేదని తలచుచుంటివా? సంతారనమునకై అతడెట్టి సంతానము, ఎట్టివేదన, ఎట్టివ్యధ నొందుచుండెనో నీవు గుర్తింప గల్గితివా?

సుశీ-- అది నీవే ఎరుగుదువు కాబోలు?

వినో--ఆహా, నే నెరుగుదును. అహోరాత్రములు మనకై వారెట్లు కుందుచున్నారో నేను గాంచుచున్నాను. వారి కంటికి నిదురయున్నది లేదు. నేను ప్రక్కనే నిల్చి విసరుచుందును. వారి కాహారము నోటికి పోవుటలేదు. నా చేతు