పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
44

అం 1]

భారత రమణి

సమావేశము కాకుండుటయే శ్రేయము. నీతండ్రియజ్ఞ ననువతింపుము. అది విఘ్న మగునను బీతిచే నేడు నీకంట బడను. నీకర్తవ్యపాలనపరమును నిరాటంక మొనర్తును. నాకు సెలవిమ్ము-- నీకు మెలగుగాక !

సుశీ-- ఓహో! నీవు కూడ ఈ కుట్రలో చేరితివా! సరే... నాకు వివాహమే వలదు. వివాహము-- నిర్మములగు పురుషుల జేరుట న్యాయ్యము కాదు. వీరిని వలచుటా? వీరి చరణములకు దాస్య మొనర్చుటా? ఏమి దుష్క్ర్తము! వినయా! నన్ను రక్షించితివి... నా యారాటమును తొలగించితివి... నాకు పెళ్ళియే వద్దు.

                (వినోదిని వచ్చును)

వినో--సుశీలా, నీ నారయ లేవైతివి.

సుశీ--దేనిని?

వినో--వినయుని ఉదార హృదయమును

సుశీ--ఉదార...హృదయమా!

వినో-- సందియము మేమి? వినయు డెంత మహాత్ముడు! ఏమి ఆత్మోత్సర్గము ! ఏమి మనోదార్డ్యము! నీ నారయ నేరవు! అప్రాజ్ఞవు కావు.. హా! దైవమా, పురుషుల చిత్తము లింత ఉదారములా? వాటిని జూచి విస్మయచకితుల మగుటచే మాకు నొరాడకున్నది. వారి పాదరజమునేని మేము, పోజాలము.