పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 4]

43

భారత రమణి

చుంటివి. పరుల హితమునకు బలి యగుట ఆత్మత్యాగ మగును కాని ఈ సమాజమును క్రూరరాక్షసి కడుపు నింపుటకు గొంతుక కోసుకొనుట ఆత్మత్యాగముకాదు, అది ఆత్మహత్య! అందుకు నేనొప్పను. నా తండ్రి కిష్టముకాకున్నను నేను నిన్ను పెండ్లి చేసుకొన దలచిన?

విన-- నీతండ్రి యనుమతి లేకున్న మనకు పెళ్లి కానేరదు. కర్తవ్యప్రతికూలములగు కార్యముల జరుగ నిచ్చువాడ గాను.

సుశీ--అయితే నామీద నీకు ప్రేమ లేదన్నమాటే.

విన--ప్రేఅబలముననే ఇంతదూరము హిత ముప దేశించితిని. నాప్రేమ యెట్టిదనిన--నిన్నంటినచొ నీ గాత్రము మలినమగునేమో అను శంకచే నీదఱి జేరవెరతును, నిన్ను తేరిచూచిన నీ రూపమందిరము అపవిత్ర మగునను బీతిచే కన్నులార నిన్ను జూడవరతును; శుభ్రనిశీధాకాశము జూచునప్పుడెల్ల నీశీలము జ్ఞప్తికివచ్చి దివ్యసుఖ మ్నుభవించు చుందును.... ఐనను నీజనకుని అనుమతిలేక నిన్ను పెళ్లి చేసికొన నొల్లను.

సుశీ-- అట్లైన ఇదే మనము చరమసమావేశము.

విన--కానిమ్ము. ఈశిక్ష అతికఠినము నిన్ను గాంచ కున్న నా కీప్రపంచమంతయు పాడుపడినట్లు తోచును, గుండె వ్రీలును.. గాని మనఉభయుల క్షేమమునకై-- మనకు