పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
42

అం1]

భారత రమణి

సుశీ-- నాకృత్యములకు పూచీ నాది, నీది కారు. నేను పసిపిల్లను కాను, నాకూ వ్యక్తిత్వ మున్నది. కావున స్వవిషయమున నాకును కొంత అధికార మున్నది. నా తండ్రిగారు తన కిష్టమైన ఏ ముసలిముద్దనో నా కంఠమునకు ఉరిపోయ్ నెంచిన నే నూరకుందు కాలము కాలము దాటినది. నా మంచిచెడ్డలు నిర్ణయింపజాలు వివేకము నాకు పొడమినది కావున ఇప్పు డాతని యాటలు సాగవు.

విన-- నీ తండ్రియెడ నీకు కర్తవ్యము లేదా?

సుశీ--నాయెడ నతనికి కర్తవ్యము లేదా?

విన--నీతండ్రి ఛేయునది నీమేలు కోరియే కదా?

సుశీ--ఈ మాట నీవు ధీరప్రశాంతస్థిరబుద్ధితోననుచుంటివా? అరువదేండ్ల తొక్కు లంపటము, వానికి నన్ను కట్టిబెట్ట దలచుచున్నాడు. ఎవరికొర్కు? సంఘబీతిచే, అర్ధాశచే ... నా సుంఅమునకై కాదు.

విన--అట్లె కానిమ్మొ. నీత్రాజ్ఞాపరిపాలనమునకై నీవు స్వార్ధమును త్యజింపవలదా?

సుశీ--ఏల?

విన--ఆత్మోత్సర్గము !

సుశీ--ఇట్లన్యాయముగా ఆత్మోత్సర్గము కావింపను. అది నా చేతకాదు. తండ్రి, సంఘము, భగవంతుడును సంతసింతురని ఆనిఛారకృత్య మాచరింఅను- ఆత్మత్యాగ మను