పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 4]

41

భారత రమణి

సుశీ-- (కన్నీటితో) వినయా?

విన--ఎందుకు?... సుశీలా! ఊరుకుందువేల?

సుశీ-- నీకు నాపై ప్రేమ కలదా?

విన-- ప్రేమ యున్నదాఅని యడిగెదవా ! ఔను, నీ వడుగ వలసినదే, ఈ విషయము నీతొ నేనెప్పుడు ప్రస్తావించలేదు. దీనిని తలచునప్పు డెల్ల నా శరీరమందలి రక్తము వేదిచెందును. ఉన్మత్తునగు కైదివలె నామాటలు నిగ్ళమును తెంచుకొని బయటపడ నుద్యమించును. కావున నె నామాట నెత్తలేదు.

సుశీ--నీవు నన్ను ప్రేమింతువా?

విన--నీ వెరుగవా? గ్రహింప జాలవా? నేను నోరు విప్పి చెప్పలేదు, కాని నా కంఠస్వరము, నావైఖరి, నా జూలును, జూచిన నీకెమియు పొడకట్టుట లేదా?

సుశీ--నోటినిండ ఒక్కసారియైన అనకుంటె వేల?

విన--నీ మేలుకొరకే...మనకు పెండ్లి కాజాలదు.

సుశీ-- ఏం?

విన-- నీతండ్రి కిది సమ్మతము కాదు. ఏలయన నేను విదేశయానము చేసితిని.

సుశీ-- నా తండ్రి సమ్మతింపకున్నను నేను నిన్ను పెండ్లియాడిన?

విన-- ఏ మంటివి ! నాకొరకు నీవు కర్తవ్యము నుల్లంఘింతువా? సుశీలా ఇది నీకు తగదు. అట్లు చేయరాది.