పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 4]

49

బారత రమణి

మాన-- నిజముగా, కాలుచేతులు గట్టి దీనిని గంగలో తోయుటే...పోయి వద్దని వారించెదను.(పోవును)

మహేంద్రుడు, కేదారుడు వత్తురు)

కేదా-- మహేంద్రా! మీతండ్రి ఏడీ?

మహే--ఎక్కడికో వెళ్ళినారు.

కేదా-- నేననుకొప్నిన ట్లయినది. క్షణములో సర్వ నాశనమైనది. కానిమ్ము. ఎటు వెళ్ళెను?

మహే--అదేమో.

కేదా--తెలిసినను ప్రయోజనము లేదు. ఇక నేనాగను. జరుగురు పని,చెప్పక తీరదు, (పైకి చూచి) కార్యప్రవాహ మిట్లున్నదేమి? అత్యవసరముగా అతని చూడవచ్చితిని, వెర్రి దేవేంద్రుడు వేళకు లేడు. ఇందుచే ఈశ్వరుడు లేడనియే సిద్దాంతము చేయవలయును. ఉన్నచో నిట్టి సమయమున ఈ పనికి విఘాతము రాజెల్లునా! శ్రీరామపురమునుంది ఈ మాట చెప్పుటకు ఇంత త్వరలో వచ్చితిని. వ్యవధి లేదు. (వాచి చూచి) ఆలస్యము చేయరాదు. మహేంధ్రా మీ నాన్నతో చెప్పు... కాదు కాదు...దానా విషయములు నీకు బోధపడవు...ఆ...విను...విని జ్ఞప్తియున్నంత మీ