పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
38

[అం1

భారత రమణి

ముడుచును, తండ్రి తల వంచును...కానిమ్ము చింతించిన ఫలమేమి? ఇంటింట్య దూరేడు కుక్కయైన నాకన్నమేలు. కూరుతు పెండ్లి కాదాయెగా అను చింత దానికుండదు. అబ్బబ్బ! గుండియ వ్రీలుచున్నది. కన్నులు నీరు గ్రమ్ముచున్నవి.

(మానద వచ్చును.)

ప్రేయసీ ! నేను నిర్ధారణ జేసితిని.

మాన--ఏమని ?

దేవే--గొంతుక కోసెదను.

మాన--ఎవరిది?

దెవే--సుశీలది.

మాన--అయ్యో ! అట్లనెద రేల?

దెవే-- యజ్నేశ్వరునకు దానినిచ్చి పెండ్లి చేసెదను.

మాన-- అదేమి ! అతడు కడువృద్ధుడే ! మూడు పాళ్లాయువు గడచినది.

దేవే--ఇంకొక పాలున్నది కదా? దానికే పెండ్లి చేయునది.

మాన--మొన్న నేదో సంబంధ మున్నదంటిరే?

దేవేవ్--వారైదువేల నడిగిరి !

మాన-- జాగ్రత్త బెట్టుదు.

దేవే-- ఎక్కడనుంది తెమ్మందువు?