పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]

39

భారత రమణి

మాన--అప్పు చేసి

దేవే--అబ్బ ! ఎంత సులభమైన మార్గమును జూపితివి! అప్పు నీ విచ్చెదవా?

మాన--నేనా? సరి సరి, ఎవరినైన అడుగుడు.

దేవే--ఎవరి నడుగుమందువో దయచేసి చెప్పుము, నా కమితోపకార మొనర్చిన దాన వగుదువు, నాకు ప్పెవ రిచ్చెదరు?

మాన--ఏమి మీ అన్నగారి నడుగకూడదా?

దేవే--అన్నగారినా! (నవ్వి) అన్నగారు అప్పిచ్చెదరా! నాకు!

మాన--తమ్ముడు కష్టముల పాల బడుచున్నప్పుడు తగిన సాయ మన్నగారు చేయరా?

దేవే--ఇది కలికాలమని మరచితివా? కాంతామణీ

మాన--అడిగి చూడుడు

దేవే--ఆ ముచ్చటయు తీరినది. పరాబవ మయినది.

మాన--ఇక నేమి సాధనము?

దేవే-- సాధనమా? ఎటుచూచినను సాధనమును చూపు వారు కానరు, అంతట నిశ్శబ్దము- నీరసము- నిబిడాంధకారము !

మాన-- అట్లైన ఈ పెళ్లి నిశ్చితమే?

దేవే-- మన మిద్దరమును దానిని కని, లాలన పాలనలు చేసి, విద్యాబుధుల చెప్పించి, అ బంగారు బొమ్మను