పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
28

అం]

భారత రమణి

  ఆహా! ఈ బాలసూర్యాచ్వతమున ఈ చేట్టుఆకులు ఎంత చక్కగా మిలమిల లాడుచున్నవి? ఈ చెట్టుపై నేను పుట్టిన మేలయి యుండును. హాయిగా అతపమును మలయపవనమును అనుభచ్వించు చుందునుకదా... కూతురికి పెండ్లి చేయలే నను విచారమే లేకపోవును. నే నేల పెళ్లి యాడితిని ?.... దానిద్ర్యము నాకేల దాపరించెన్?... సంతాన మేల కలుగవలయు? మొదటనె మూసమయ్యె.
                [సదానందుడు వచ్చును]
సదా-- ఏమి దేవేంద్రా ! చింతామగ్నుడ వైనట్ లున్నావు?

దేవే-- లేదు, లేదు, నాకేచింతయు లేదు.

సదా-- అట్లనకుము నీమోమున మందహాసము లేదు.. నాయెడ దాచెదవా?

దేవే-- దానికేమి గాని... సదానందా ! నీవు చిన్నప్పుడు పాటలుచేసి పాడుచుంటివే?

సదా-- ఇప్పుడు నట్లే చేయుచున్నాను కాని, ఈ పాటలు వేరు.

దేవే--ఎట్లు ?

సదా--ఇప్పుడు ప్రేమగీతములు వ్రాయును, పాడను, శృంగార హాస్య గీతముల రచించు దినములు గతించెను; నాకు చెల్లినవి, సంఘమునకును చెల్లినవి ఇప్పుడు జావళీలు, పదములు మానితిని ఇప్పటి పాటలు వేరు.,