పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం.3]

29

భారత రమణి

దేవే-- నీటి నెవరు విందురు.

సదా-- వినక తప్పదు వాటిని నాటకములలో జొన్పి తివి. అన్నట్లు నేనొక నాటక సమాజమును స్థాపించితిని సుమా, నీవు వినలేదు. కాబోలు?

దేవే-- అటులనా? వేషము లెవరు వేయుదురు.

సదా--అబ్బో ! వారికి మనదేశమున కొదువ లేదు దేవేంద్రా నేను పోలయు.

దేవే--ఏమి?

సదా-- తొందరపని యున్నది. ఈ త్రోవను పోవుచు నిన్ను చూడవలయునని వచ్చితిని. రేపు మరల వచ్చెదను.

(పోవును)

దేవే--నాకు నిజమైన నేస్తము సదానందుడే.... ఈతని కుమాదునకు మా సుశేల నిచ్చి పెండ్లిచేసిఅన నెంతయు చక్కగా నుండియుండును, కాని అది అసంభవము. ఇతడు సముద్రయానముచేసి సంఘమునకు మహాపరాధము సల్పెను. కావున దానికి వెలియై నాడు.... కన్నము వేయవచ్చును, మోసము చేయవచ్చును, వేశ్య నుంచుకొనవచును. సంఘము వాటిని సహింపగలదు, కాని విదేశయానము విషతుల్యమని యెంచును. ఆ ఘోరపాప మపరిహార్యము! అమార్జనీయము!.... కూతురు పెళ్లి చింతచే కొన్ని రోజులనుండి నాకు నిద్ర లేదు. శరీరము....