పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]

27

మూ డ వ రం గ ము

                    ----

[దేవేంద్రు నింటిలో అతడు భార్యయు ప్రవేశింతురు]

దేవే-- అప్పు తీర్చక నే నింకొక ఖర్చు తలపెట్టబోను.

మాన-- ఈడు వచ్చిన పిల్లను ఇంట నుంచుకొనుటకు వీలా ?

దేవే--బయటికి గెంటివేయుము.

మాన-- అట్లందు వేల ?

దేవే-- తండ్రిగారి అప్పు తీర్చకున్న తలవంపులు. అసలు ఫాయిదా కలిసి అయిదువే లయినది.

మాన--పిల్లకు పెండ్లిసేయుట తప్పునా?

దేవే--అదేమో, కుర్రవానికన్న కుర్రది ఎక్కువా?

మాన-- ఇద్దఱును సమానులే

దేవే-- ఇద్దఱు కొడుకు లుండిరి. పెద్దవాడు బెంగపెట్టు కొని సన్యసించెను, చిన్నవానికి చదువు చెప్పించ్చు శక్తి లెకుండుటచే పాఠశాల కంపక పాడుచేసితిమి.

మాన--వానికేమి ? ఏదో రీతిని వాడు పొట్టపోసుకొన గలడు. పిల్లమాట ?

దేవే-- దీనితో తీరినదా? మూడవ దున్నది... లోనికి పొమ్ము, పిల్లపెండ్లికై నీ వనుకునంత అసడ్డ నాకు లెదు.

[ఆమె పోవును]