పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
26

అం 1]

భారత రమణి

ఉపే--యజ్నేశ్వరా, ఆ మాట నీవు మనసార అన్న దేనా?

యజ్నే-- ఆహా! అట్టిదే.

ఉపే-- కాని, అది వివాహము కాజాలదుసుమా, వ్యభీచార మగును.

యజ్నే-- ఉపేంద్రా ! నాయెదుట మునిముచ్చుతనము మానుము. మనలో పరస్పర మెరుగనివా రెవరు ? ఒక్క సారి నీగుట్టు....

ఉపే--నీకు పుణ్య ముందును. ఊరకుండుము. మాట వరుస కంటిని.

యజ్నే--నాకన్ను కప్పజూచెదవా? మన మిద్దరమొకమందలోని వారమే, మన మిద్దరము చెనటులమే, పైపెచ్చు నీవు మునిముచ్చువు. నాకు పెద్దన్నవు.

ఉపే-- చాలించు. నన్నేమి సేయమందువు?

యజ్నే--ఇందు నాకు సాయము చేసెదవా?

ఉపే--అట్లే చేసెదను.

యజ్నే-- నిన్ను నమ్ముకొందునా?

ఉపే-- పూర్ణముగా!

యజ్నే-- సరే, నేను పోయి వచ్చెదను (పోవును)

                           -----