పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 2]

25

భారత రమణి

చున్నదట నారెండవ భార్యా మొన్నే గతించినది, కావున ఆపిల్లను నాకు పెండ్లిచేసినచో--

కేదా-- నీకా? మంచి వికటమే నీకామెనిచ్చుటా?


యజ్నే--ఏమీ? తప్పా? పిల్ల ఎదిగినది. ఎవనికైన నిచ్చి పెండ్లి చేయవలయునా, లేదా? కావున నాకు--


కేదా--ఆపిల్లనిమ్మందువా? ఏమి వింత! ఏమి ముచ్చట! (నవ్వి) యజ్నేశ్వరా! నీకు మతి చెడినది, మందుమతిను నిజమే.

యజ్నే--నీకు నవ్వులాటగా నున్నదా? ఇది కుదిరినచో దేవేంద్రునకు "ఏకక్రియాద్య్వర్ధకరీ" అగును.

కేదా--యజ్నేశ్వరా! ఇటు విను, నాకొకకూతురుండి--దానికి గుడ్డి, చెవుడు, కుంటి..ప్రపంచమున ఎన్ని అవలక్షణమున్నచో, అన్నియునుండి, దానికి వివాహము చేయకున్న నన్ను శూలమునకు గుచ్చుదుమని కులమువారు నెఱిపించినను, దానిని కాలు చేతులు గట్టి ఏ గోతిలోనో, నూతిలోనో, పడదోసి శూలమును అమితసంతోష్గమున అందరి యెదుట ఆరోహింతును కాని, మూఢుడా! నీబోటి పాలసునకు కట్టిపెట్టుదునా? సత్యము, సత్యము, సత్యము..

(పోవును)

యజ్నే--నీకింత పొగరా! ఉండుండు నామహిమ చూ పెదను (ఉపేంద్రుడు వచ్చును)