పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
24

అం 1]

భారత రమణి

అప్పిచ్చుట ? వడ్డీని విడుచు వెంగలి యుండునా ? నాదా పెంకితనము?

కేదా--[వాచీ చూచి] ఓహో ! తొమ్మిదయినది. రెయిలుబందికి వేళ కావచ్చినది. యజ్నేశ్వరా! అయితే విడువవా?

యజ్నే-- విడువను

కేదా--నీకు నరకమె గతి! [పోవును]

యజ్నే-- కేదారా ! ఒక మాట

    [కేదార తిరుగవచ్చును]

కేదా--వదలుకొందువా? శపించినాను, ఇక దానిని క్రమ్మరింపజాలను ఇంతమాత్రము కరుణించెదను. వడ్డీ విడిచినచోనరకమున నొక సంవత్సరము కన్న నెక్కువకాలముండనక్కరలేకుండ జేసెదను.

యజ్నే-- ఈ మాటలకు నేను జంకువాడను కాను, నరకభయము నాకు లేదు. ఒకపని నీవుచేయగల్గినచో వడ్డీనే కాక అసలుకూడ విడిచెదను.

కేదా--ఇదేదో అసాధ్యమైన పని.

యజ్నే-- అసాధ్యము కాదు తన్మూలమున ఇద్దరకును మేగును.

కేదా-- అలాగా ఇదేదో తృణానృతకూపము. (చేతి కర్రనుంచి) వినవలయు, ఏమిటది?

యజ్నే--దేవేంద్రునకు వివాహయోగ్యయగు కూతు