పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
20

అం1]

భారత రమణి

  బీజము నాటిన పెరుగు వృక్షము

భక్తు-- ఓహో! మహాత్మా ! మరొక్క తత్వం-

          [ఫలహారము కొనితెత్తురు]

ఉపే-- భక్తులారా, గోధుమలు బీజములు, వాటిని చూర్ణము చేసిన పిండి యగును. దానిని నేతితొ కలిపిన పూరీ అగును. ఎంతయొ కంటిరా !

భక్తు-- ఆహాహా! ఏమి వింత !

ఉపే--ఆపూరీ కోవా (చిక్కనిపాలు)తో కలిపినచో కడుపులోనికి సులువుగా పొవురు. (తినుచూ) శ్రీహరీ ! నీవే సత్యస్వరూపడవు.

భక్తు-- శ్రీహరియే సత్యస్వరూపుడు !

నవీ-- మహాప్రభూ ! మేముకూడా పోయి హరినామ ప్రభావ మారగించుము.

ఉపే--మంచి దట్లే చేయుడు. రాధేకృష్ణ!

భక్తు--గురూజీ ! మీచరణదాసులము, మామీద దయయుంచుడు, మేము పాపులము.

ఉపే-- హరినామ సంకీర్తనము చేయుడు, సంసార సాగరమున భయముండరు.

భక్తు--చిత్తము, సెలవు--[పాడుచుపొవుదురు]

ఉపే-- భజనసేయువారే భక్తులు, ఆభజన ముక్తికైన నెమి ? భక్తియే ప్రధానము.... కేదారునికి