పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
40 2]

21

భారత రమణి

నాగుట్టు తెలిసినట్లున్నది. వాని కేదేని ఉపదేశించి మాకూటములో కూర్చవలయును. లేకున్న ముంచును.... ఎవరో వచ్చుచున్నట్లున్నది. ఇక గొంటుతన మారంఃభింపవలయును. రాధేకృష్ణ గొవించ, శ్రీహరి !

                      (యజ్నేశ్వరుడు వచ్చును)

ఉపే-- రమ్ము- యజ్నేశ్వరా ! నీతో కొంత ప్రసంగింప వ్చలయును.

యజ్నే-- ఏమి టది?

ఉపే-- మా తండ్ర్గారు చేసిన అప్పు మాదేవేంద్రు నొద్ద పుచ్చుకొనుము.

యజ్నె--అత డెట్లివ్వగలడు ?

ఉపే-- ఇల్లు వాకలి అమ్మించుము.

యజ్నే-- ఏలా గిచ్చినను సరే, నాకభ్యంతరములేదు. ఒక చిల్లి గవ్వైన వదలను.

ఉపే-- నీదాహము తీరునట్టిదా ?

యజ్నే-- అబ్భో ! నీకు పెండ్లమా ? పిల్లలా ?

యజ్నె-- అదెంత సేపు?

ఉపే-- ఏమీ? తిరుగ పెండ్లియాదురువా? ఏమి?

యజ్నే-- పిల్లను వెదుకుచున్నాను.

ఉపే-- అలాగా! నాతో చెప్పవైతివి !