పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం.2]

19

భారత రమణి

కేదా--(తెరలో) మిక్కుట మయ్యె! నిబ్బరము ! మతి పోవుచున్నది!

నవీ--ప్రభూ! ఆపాషండు నిక పిలువకుడు.

భక్తు-- పాలసుడు- పలువ- పాపి!

ఉపే-- ఆహా! పాడయ్యెనే ! వీని గతి ఏమి కావలయు?

వినో--ఆహా! హా ! ప్రభువువారు దయా సముద్రులు!

శంక-- పాపుల నుద్దరించుటకే పరమపురుషు లవత రింతురు. పనికిమాలినవరిని పరమపదమునకు పంపుదురు.

ఉపే--భక్తులారా! సృష్టిలో పనికిరాని పదార్దమే లేదు- చూడుడు.

[అందరు పాట పాడుదురు]

అండపిండబ్రహ్మాండము నంతట-
     నిండియుండుగద. నీరజనాభుడు.
సకలచరాచర.సర్గము గాంచియు
      సర్వేశ్వరుని-చాతురి తెలియదు ॥అండ॥
గడ్డిపొచయును-ఘనమగు వస్తువు
      కనుడది గోవుల-కనువగు మేత
తిని యొసగవె అవి తీయని పాలను
      మనలను పోషిం-పను నాహారము ॥అండ॥
పండున నిండుగ-నుండును రసము
      పీల్చిన తేలును-పీచును టెంకయు