పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
18

అం 1]

భారత రమణి

ముచ్చును పాగడుట విన్న నాకీర్ష్య పుట్టవలసినదే! నెను కూడ మీకు కల్లు, గంజాయి, జంగు నిచ్చుచు కడుపుకూటికి కాస్త దమ్మిచ్చినచో నాదగ్గర చేరి కుక్కలవలె కాలు నాకుచు తోక జాడించుచుందురు. మీబోటి తులువలతో నాకేం?... ఉపేంద్రప్రభూ! నేను మీకొరకు రాలేదు, యజ్ఞశ్వరుని వెతకుచు అత డిక్కడ చేరియుండునని తలచి వచ్చితిని... ఐన నీతో నొకమాట చెప్ప దలచినాను. మీ తండ్రిగారు తన యావదాస్తియు నీకు చెందవలెనని వీలువ్రాసి ఋణము మీసొదరుల కిద్దరికి చెరిసగము పంచి యిచ్చిరా? ఇది నమ్మజాలను. ఆలొచించినకొలది ఇది అబద్ధమని నాకు తట్టుచున్నది.

   ఉపే--నీ యభిప్రాయ మేమి? నీ వేందువు?

కేదా-- ఆ నీలసత్యము. నాయూహ నిజమని నిదర్శనము చూపించెదను... మహాత్మా నాకు సెలవు.

పోబోవును

ఉపే-- కేదారా ! ... ఒక మాట......

కేదా-- వలదు. ఇక సహించలేను. యజ్ఞశ్వరుడు మీకూటములొ నుండునని తలచి, అతడు కనబడలేదు. ఇక్కది వాతావరణము విషపూరితము, నాకూపిరాడుటలేదు. నేను పొయేదను.(పోవును)

ఉపే--ఒక్కమాట విను.