పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 2]

15

భారత రమణి

వినో-- సేవ చేయుటా ? గురువుగారు రోగులకు సేవ చేయుదురా ? ఆయన ముఖచంద్రబింబము నారయుము. అట్టి దివ్యసుందరమూర్తి ఒకరికి సేవ చేయునా?

కేదా--అయ్యె బాబో ! ఎంతప్రమాదము? రోగిగాని రోగవతిగాని ఎక్కువ చక్కదనము కలవా రైనచో?

వినో--అవేటిమాటలు కేదారా? గురువుగరిని నిందింతువా ?

కేదా-- నిందించుట నా కలవాటు లేదు. నేడు ఇంటింట ఇట్టి మహాత్ములే వెలయుచున్నారు. కుక్కగొడుగులు లాగున ఎటుచూచినను దంభభావతులే ! వారి చుట్టును మీబోటి భక్తులు కూడ కురుదుపడినారు. దేశము బాగ్యము పండినది.

 వినో--అరుగో ! ప్రభువువారు విచ్చేయుచున్నారు.

కెదా--ఎవరు ? గురువుగారా ? అవతరించుచున్నారా? ఉదయించుచున్నారా ?

అందరు--అదుగో ! వచ్చినారు... (లేతురు)

[జపమాల త్రిప్పుఛు కన్నులరమోడ్చి ఉపేంద్రుడు వచ్చును]

భక్తులు--సద్దు ! సద్దు ! నమోనమ: