పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
16

[అం]

భారత రమణి

ఉపే--భక్తకోటికి భద్రమగుగాక ! వత్సలారా ! లెండు...(అందరు నిలుతురు)

వినో--ప్రభూ--కేదారుడు--

ఉపే--ఓహో! కేదారా! (నవ్వుచు) నేడు గొప్ప సుదినము, చైతన్యకూటము చరితార్ద మైనది. కేదారా! ఊరక రారు నీబోటి మహాత్ములు.

కేదా-- ఒకసారి మీనోటినుండి వైష్ణవధర్త్మ తత్వోపన్యాసము వినుటకు వచ్చిరిని మహాత్మా ! వందనములు.

ఉప్--తత్వమా?...నాకేమి తెలియును? మూర్ఖుడను, జల్ముద, అవివేకిని! ఆ ధర్మతత్వము మహాజ్ఞానీయు, భక్తశిరోమణియు నగు గౌరాంగదేవుడు.. (కన్నులుమూసి నమస్కరించును)

భక్తు-- ఓహో! హో! హో! (నమస్కరింతురు)

ఉపే--శ్రీకృష్ణ చైతన్య-ప్రభు నిత్యానందా.

భక్తులు--(పాడుదురు)

ఉపే--హరేకృష్ణ హరే రామారాధాగోవిందా!

భక్తు--(పాడుదురు)

ఉపే-- వృక్షమునుండి పుష్పము, పుష్పమునుండి ఫలము, ఫలమునుండి బీజము.. కాబట్టి బీజమే ఉత్పత్తికి కారణము.

భక్రు--ఓహో ! ఏమి గూఢతత్వము!