పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
14

[అం]

భారత రమణి

తరించిపోవుదురు. నశరీరస్వర్గము మీకు లభించును.

నవీ-- ఈ దౌర్బాగ్యుల కంతటి అదృష్టమా? దానికై వారి శ్రీ చరనములను సదా గొల్చుచున్నాము.

కేదా-- శ్రద్ధగా గొల్చు చుండుడు.

వినో-- అటువంటి త్యాగియు, మహాత్ముడును...

కేదా--త్యాగమా ? ఎవనికైన ఒక దమ్మిడీ వదలునా?

వినో-- దమ్మిడీ ! పాడు దమ్మిడీ ! తుచ్చము ! తుచ్చము ! అమూల్యమైన ఉపదేశము అందరికి వితరణము చేయుదురు.

కేదా-- డబ్బు పుచ్చుకొనకయే ?

వినో--వారికి ధనము తృణతుల్యము. వైష్ణవసంప్రదాయమునకు వ్యాఖ్యానము వారినోటనుండి మీదు వినినచో-

కేదా-- తరింతును కాబోలు?

వినో--అదే వారి త్యాగము. మాయధనము గొనకయే వారు మనోవ్యాధికి మందిత్తురు.

కేదా--రోగము కుదరకున్న సొమ్మును తిరుగ ఇచ్చి వేయుదురా?

శంక--ఇచ్చివేయుట ఏమిటి? మొదట పుచ్చుకొన నిదే !

కేదా-- బొత్తిగా ? అట్లైన రోగుల కుచితముగా సేవ జేయుదురు కాబోలు ?