పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 2]

13

భారత రమణి

కేదా-- చూదకేమి? పలుమారు దర్శించిరిని.

వినోదుడు-- అట్లైన వారి మహాత్యము నీకు తెలియలేనట్లున్నది!

కెదా--తెలిసినది, తెలిసినది. చక్కగా విదితమైనది.

శంకరుడు--ఎరుగ నెరుగవు. నీకు తెలియుండినచో వారి నిట్లు నిందితువా?.... వారు కేవలము విష్ణుభక్తులు, సాధువులు, పరమ భావతులు....

నవీ--అబ్బో ! వరి జడ లింత పొడవు...

కేదా-- ఓహో, జడల పొడవును బట్టి సాధుత్వ సాంద్రత నిర్ణయించు చున్నారా?

నవీ--కాదు కాదు. భక్తి ! భక్తి ! మాగురువు గారి బరిభక్తిని మీరు చూడలేదు. అందుచేతనే పొరబడుచున్నారు. వారి భక్తి మీకెట్లు తెలియగలదు?

కెదా--నాకు తెలియ నవసరము లేదు.

వినో--హరినామ సంకీర్తనము వారు చేయుచున్నప్పుడు వారికి విష్ణుమూర్తి పూనుటచే నిలువు నిటాకున పరవశమై వారు పడిపోవుదురు.

కెదా--అటులనా? వారి వెనువెంట మీరుకొడ పదిఫొవుదురా?

శంక--అది మాకు వశమా? వైష్ణవధర్మతత్వము వారియొద్ద నేర్చుకొను చున్నాము.

కేదా--నేర్చుకొనవలసినదే. చక్కగా నేర్చుకొనుడు,